“గేమ్ చేంజర్” సాంగ్ పోస్టర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్?

“గేమ్ చేంజర్” సాంగ్ పోస్టర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్?

Published on Oct 24, 2023 10:06 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఇండియన్ జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సెన్సేషనల్ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ అయితే వచ్చిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పై ఓ మాస్ పోస్టర్ తో శంకర్ మార్క్ గ్రాండియర్ తో అయితే ఈ పోస్టర్ తో సాంగ్ ఎలా ఉంటుందో రివీల్ చేశారు. అయితే ఈ సాంగ్ లో చరణ్ ని చూస్తే ఓ బుక్ ని పట్టుకొని ఉండడం కనిపిస్తుంది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఓ ఫైల్ లాంటిది చరణ్ పట్టుకొని కనిపిస్తాడు.

మరి మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు పోస్టర్ కి కూడా ఏమన్నా లింక్ ఉందా శంకర్ ఈ రిలేటెడ్ ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పాలి అనుకుంటున్నారా అనేది ఇపుడు ఆసక్తిగా మారింది. ఇక తన కంపోజ్ చేసిన ఈ సాంగ్ అయితే ఈ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది దానితో మాత్రం మరిన్ని డీటెయిల్స్ బయటకి రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు