రీసెంట్ గానే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మన తెలుగు మొట్టమొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా” కోసం ఒక స్పెషల్ టాక్ షో కి ఓకే చెప్పారని తెలిసిందే. అలాగే దానిపై “ఆహా” వారు ఒక సాలిడ్ క్లారిటీ కూడా ఇచ్చారు. మరి దీనితో ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలా ఉంటుంది అన్న అంశాలు మరింత రసవత్తరంగా మారాయి. అయితే ఇదిలా ఉండగా ఈ గ్రాండ్ టాక్ షోలో ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉందట.
మొత్తం 10 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసిన ఈ షోలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్వామి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నట్టు ఇప్పుడు టాక్. ఈ కాంబో అనేదే వారి అభిమానుల్లో చాలా స్పెషల్. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అన్నది చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ గ్రాండ్ షో ను వచ్చే దీపావళి కానుకగా ఆహా లో స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.