“రామారావు ఆన్ డ్యూటీ” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుంది.!

Published on Jul 6, 2022 11:00 am IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు శరత్ మందవతో రవితేజ నటిస్తూ దర్శకునిగా అతడికి అవకాశం ఇచ్చిన సినిమా ఇది. అయినా కూడా మంచి అవుట్ పుట్ తో తాను ఈ చిత్రాన్ని తీస్తున్నాడు.

అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఐటెం సాంగ్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుండగా మేకర్స్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

మరి తనపై తన రోల్ ని రివీల్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి వేణు ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని చాలా మంది అనుకుంటున్నారు మరి మేకర్స్ ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :