పవన్ – క్రిష్ ప్రాజెక్ట్ లో దుమ్ము లేచిపోయే సాంగ్.!

పవన్ – క్రిష్ ప్రాజెక్ట్ లో దుమ్ము లేచిపోయే సాంగ్.!

Published on Feb 24, 2021 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కూడా ఒకటి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను మించే విధంగానే ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక్కో డీటెయిల్ కోసం వినబడుతుంటే తెలుస్తుంది.

అలా నిన్ననే ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసమే టాక్ బయటకు వచ్చింది.కానీ ఇప్పుడు మాత్రం ఓ సాంగ్ విషయంలో టాక్ పవన్ అభిమానులకు పిచ్చ కిక్ ఇస్తుంది. “గబ్బర్ సింగ్” సినిమాలో టైటిల్ సాంగ్ కు సూపర్బ్ గా కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ మాస్టర్ తో ఈ సినిమాలో కూడా ఒక సాలిడ్ సాంగ్ ను చేశారట.

లాక్ డౌన్ కన్నా ముందే 200 మంది ఆర్టిస్టులతో ఈ సాంగ్ ను తెరకెక్కించారట. ఇది మాత్రం థియేటర్స్ లో దుమ్ము లేపే విధంగా ఉంటుంది అని గణేష్ మాస్టర్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు ఇదే కట్ పవన్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది. మరి ఈ భారీ చిత్రంలో ఆ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు