బెట్టింగ్ యాప్స్ వివాదం.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అనన్య నాగళ్ల

బెట్టింగ్ యాప్స్ వివాదం.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అనన్య నాగళ్ల

Published on Mar 21, 2025 9:00 PM IST

ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వంటి అంశాలు టాలీవుడ్‌ను చుట్టుముట్టాయి. యూట్యూబర్స్ మొదలుకొని పలువురు టాలీవుడ్ స్టార్స్ వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో భాగం కావడంతో పోలీసులు వారికి నోటీసులు పంపారు. ఈ జాబితాలో టాలీవుడ్ భామ అనన్య నాగళ్ల కూడా ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంపై ఆమె తనవంతుగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది.

అయితే, తాను గతంలో తెలియక ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రమోట్ చేశానని.. స్టార్ యాక్టర్స్ చాలా మంది ప్రమోట్ చేస్తున్నారని.. తాను కూడా అలా చేశానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే, ఇప్పుడు తాను ఎలాంటి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం లేదని.. కానీ, ప్రభుత్వానికి చెందిన ప్రజా రవాణా సర్వీస్‌లపై బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయొచ్చా..? ఇది చట్ట వ్యతిరేకం కాదా..? అంటూ మెట్రో రైల్‌పై ఉన్న ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పోస్టర్‌ను అనన్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మొత్తానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశం రోజుకో వార్తతో హాట్ టాపిక్‌గా మారుతుంది. మరి ఈ అంశం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు