బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండేకి సక్సెస్ లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా, అనన్య పాండే లవ్ లైఫ్ గురించి మరో వార్త వైరల్ అవుతుంది. స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ తో అనన్య పాండే డేటింగ్ చేస్తోందని కొత్తగా టాక్ నడుస్తోంది. అనన్య పాండే, శుభ్‌మన్ గిల్ కలిసి కొన్ని రోజుల క్రితం ఒక యాడ్ చేశారు. ఆ యాడ్ షూట్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అనన్య పాండే సమాధానం ఇస్తూ.. ‘విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక యాడ్ షూట్ సమయంలో కలిసి ప్రేమలో పడ్డారు. శుభ్ మన్ గిల్ – నేను అలాగే కలిశాం, కాబట్టి.. ప్రేమలో పడ్డాం అని కొందరు వార్తలు రాస్తున్నారు. అందులో నిజం లేదు. బేసిక్ గా మేం చాలా డిఫరెంట్. నాకు, శుభ్‌మన్‌కు మధ్య ప్రస్తుతం మాటలు కూడా లేవు. ఇక రొమాన్స్ ఎలా ఉంటుంది ?’ అంటూ అనన్య పాండే క్లారిటీ ఇచ్చింది.