బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే రొమాంటిక్ సినిమాలు చేయాలనుందని చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘లైగర్’, ‘డ్రీమ్‌గర్ల్ 2’లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గర అయిన అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉంది. తాజాగా ‘కంట్రోల్’ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ. కాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పాండే క్రేజీ కామెంట్స్ చేసింది.
ఇంతకీ, అనన్య పాండే ఏం మాట్లాడింది అంటే.. ‘కరణ్ జోహర్ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని నాకు బలమైన కోరిక ఉంది. అలాగే, సంజయ్ లీలా భన్సాలీ నాకెంతో ఇష్టమైన దర్శకుడు. సంజయ్ సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను. నిజానికి నా కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో జానర్ సినిమాల్లో నటించాను. అయితే, రొమాంటిక్, హారర్, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలనుంది” అని అనన్య పాండే చెప్పింది.