రీసెంట్ గా టాలీవుడ్ దగ్గర వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రాల్లో “దర్జా” కూడా ఒకటి. ప్రముఖ యాంకర్ సహా నటి అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటుడు సునీల్ కూడా మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ లేటెస్ట్ చిత్రంని దర్శకుడు సలీం మాలిక్ అయితే తెరకెక్కించారు. మరి ఇప్పుడు ఈ చిత్రం అయితే ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.
ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు కొనుగోలు చేయగా ఇది ఇందులో ఓ స్పెషల్ ప్రీమియర్ గా ఈ దసరా కానుకగా అక్టోబర్ 5 నుంచి అందుబాటులో ఉండనుందట. మరి అప్పుడు మిస్ అయ్యిన వాళ్ళు అయితే ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో అక్సా ఖాన్, షకలక శంకర్ లు కూడా నటించగా శివ శంకర్ పైడిపాటి నిర్మాణం వహించారు.