‘జబర్థస్త్’ యాంకర్ గా ప్రేక్షకులను అలరించి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుంచి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అయితే, తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ అభిమాని అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై కూడా స్పందించింది.
‘ట్రోలర్స్ అంటే వికారమైన జీవులు. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలుసుకున్నా. వాళ్లతో టైమ్ వేస్ట్ చేసుకోవాలని లేదు’ అని అనసూయ చెప్పుకొచ్చింది. అలాగే టీవీ రంగానికి దూరం కావడంపై కూడా అనసూయ స్పందిస్తూ.. ‘యాంకరింగ్ నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. ఐతే, అందులో కొంత విరామం కావాలనిపించింది. అందుకే ప్రస్తుతానికి యాంకరింగ్ కి బ్రేక్ తీసుకున్నాను’ అంటూ అనసూయ క్లారిటీ ఇచ్చింది.