ఈ స్టార్ హీరో పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Dec 5, 2022 10:19 pm IST

బుల్లితెర టాప్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఆమె నటిగా మంచి పాత్రలను పోషిస్తూ, తనకంటూ అభిమానులను సొంతం చేసుకుంది. టీవీ నుండి విరామం తీసుకుంది. కాస్త అస్వస్థతకు గురైన అనసూయ తన అభిమానులతో ప్రశ్నోత్తరాలు నిర్వహించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

తాను చూసిన సినిమాని సిఫార్సు చేయమని అడిగినప్పుడు, అనసూయ వెంటనే కన్నడ చిత్రం కాంతార అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక హీరో రిషబ్ శెట్టి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. చాలా ఇంటెన్స్ గా నటించారు అని, ఆ చిత్రం నుండి బయటికి రాలేక పోతున్నట్లు తెలిపారు. అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అనసూయ తదుపరి కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చిత్రంలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :