నటి హరితేజ మనదరికి తెలుసు బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ అమ్మాయి, తాజా ఇంటర్వ్యూ లో హరితేజ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ కి ఎలా వచ్చింది ? ఏం అవుదామని వచ్చింది ? అనే విషయాల గురించి చెప్పింది. పదో తరగతి చదువుతున్న సమయంలో రవీంద్ర భారాతి లో ఒక ప్రోగ్రామ్ లో డాన్స్ చేసిందని, ఆ ఫొటోస్ ఒక సినిమా ఆఫీస్ వాళ్ళు చూసి సినిమాలో అవకాశం ఇచ్చారని చెప్పింది.
కెరీర్ మొదట్లో ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాలో నటించిన హరి తేజ ఆ సినిమా తరువాత ‘దమ్ము’, ‘అత్తారింటికి దారేది’, ‘1 నేనొక్కడినే’ ‘డిజే’ ‘అ ఆ’ ‘విన్నర్’ చిత్రాల్లో నటించింది. మంచి డాన్సర్ అవుదామని అనుకున్న హరి తేజ నటిగా చిత్ర పరిశ్రమలో మంచి పాత్రలు చేస్తుంది, బిగ్ బాస్ షో తరువాత ఈ అమ్మాయికి చాలా అవకాశాలు వస్తున్నాయి, తాజాగా ‘ఫిదా’ అనే ప్రోగ్రాం చేస్తుంది, సెలెబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తే ఈ కార్యక్రమం టెలివిజన్ లో ప్రసారం అవుతుంది.