గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న ప్రముఖ యాంకర్ లాస్య..!

Published on Sep 21, 2022 5:43 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర పాపులర్ అయ్యినటువంటి ఎందరో నటులు యాంకర్స్ లో యాంకర్ లాస్య మంజునాథ్ కూడా ఒకరు. మరి ఆమె ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ సహా ప్రొఫిషినల్ లైఫ్ పరంగా కూడా బిజీగా ఉండగా లేటెస్ట్ గా అయితే ఆమె ఓ గుడ్ న్యూస్ ని సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి షేర్ చేసుకుంది. తాను ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్నట్టుగా తన భర్తతో కలిసి ఓ ఫోటో షేర్ చేసుకొని ఈ గుడ్ న్యూస్ ని తెలిపి ఆనందం వ్యక్తం చేసింది.

దీనితో ఇప్పుడు ఈమె హ్యాపీ న్యూస్ వైరల్ గా మారింది. మరి లాస్య అయితే గతంలో తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కనిపించి మెప్పించింది. మరి ఆ టైం లో తన మొదటి బిడ్డతో ఉన్న ఎమోషనల్ బాండ్ కోసం కూడా ఎంతో అపురూపంగా చూపించారు. ఇక ఇప్పుడు మరో బిడ్డ రాకతో వారి ఇంట ఇప్పుడు ఆనంద వాతావరణం నెలకొంది. మరి ఈ సందర్భంగా మా 123తెలుగు యూనిట్ కూడా వారికి కంగ్రాట్స్ తెలుపుతుంది.

సంబంధిత సమాచారం :