మన తెలుగు బుల్లితెర దగ్గర ఉన్నటువంటి ప్రముఖ యాంకర్ లలో శ్రీముఖి కూడా ఒకరు. మరి ఎన్నో షోస్ లో యాంకరింగ్ చేయడమే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా అలరించింది. అయితే లేటెస్ట్ గా శ్రీముఖి ఒక వివాదంలో ఇరుక్కుంది. ఈ సంక్రాంతికి వస్తున్నా సినిమాల్లో ఒకటైన “సంక్రాంతికి వస్తున్నాం” రీసెంట్ ఈవెంట్ లో హిందువులు భక్తి శ్రద్దలతో కొలిచే రామ లక్ష్మణులని ఫిక్షనల్ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
దీనితో సోషల్ మీడియాలో తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందువులు ఆమెపై కామెంట్స్ చేశారు. తాను క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అయితే ఫైనల్ గా శ్రీముఖి ఈ అంశంపై క్షమాపణలు చెప్పుకొచ్చింది. అది నేను పొరపాటుగా మాత్రమే అన్నాను అని నేను కూడా హిందువునే ప్రత్యేకించి రామ భక్తురాలినే ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉంటాను అని ప్రతీ ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాను అంటూ వీడియో ద్వారా తెలిపింది. దీనితో ఆ ఆగ్రహం వ్యక్తం చేసిన వారంతా ఇపుడు శాంతించారు.