రిలీజ్ కు రెడీ అయిన యాంకర్ విష్ణుప్రియ “చెక్ మేట్” సినిమా!

రిలీజ్ కు రెడీ అయిన యాంకర్ విష్ణుప్రియ “చెక్ మేట్” సినిమా!

Published on Nov 27, 2020 1:00 PM IST

స్మాల్ స్క్రీన్ పై సెటిల్డ్ అయిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ విష్ణు ప్రియ మెయిన్ లీడ్ లో చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాత గా తెరకెక్కించిన సినిమా *చెక్ మేట్*. డాక్టర్ రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో విష్ణుప్రియ, చిత్ర దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి, నటుడు ఆర్కేతదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ సందర్భంగా దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి మాట్లాడుతూ: చెక్ మేట్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. థియేటర్స్ డిసెంబర్ 4నుంచి ఓపెన్ అవుతాయి అని తెలుస్తుంది. ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తాము. ఇటీవల ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ మా సినిమా చక్ మేట్ ట్రైలర్ ను విడుదల చేసారు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సినిమా కూడా లేటెస్ట్ కు తగిన విధంగా అన్ని హంగులతో ప్రేక్షకులను మెప్పించే విధంగా వుంటుంది అని అన్నారు. అలాగే నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను వాళ్ళు ఎలా దైర్యం గా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాము. రాజేంద్ర ప్రసాద్ గారు,బ్రహ్మానందం గారు రఘుబాబు మిగతా అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. భారీ స్టార్ కాస్ట్ తో,మలేషియా సింగపూర్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో తెరకెక్కించాం అని అన్నారు.

అలాగే విష్ణు ప్రియ మాట్లాడుతూ : చెక్ మేట్ అంటే ఇద్దరు యంగ్ స్టార్స్ మధ్య వుండే ప్రోబ్లం ను ఒకరు వలన ఒకరు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ సమస్యనుంచి బయట పడడానికి అవతల వాళ్ళు తీసుకున్న యాక్షన్ చక్ మేట్. ఈ అవకాశం నాకు శివరాత్రి వచ్చింది. ఆ శివుడే నాకు ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటాను. స్టొరీ ఎంటి హీరో ఎంటి అని అడగలేదు. మా మమ్మీ వాళ్ళ మ్యుచివల్ ఫ్రెండ్స్ ప్రసాద్ గారు. మా ఇంటికి వచ్చి నన్ను చూసిన తరువాత నువ్వే హీరోయిన్ అంటే నేను నమ్మలేదు.

అయితే ఒక వారం రోజులకే ఆర్ ఎఫ్ సి కి పిలిచి షూట్ మొదలు పెట్టినప్పుడు అక్కడున్న కెమెరాలు…జిమ్మిలు ఆ వాతావరణం చూసి బ్లాంక్ అయ్యాను. నాకు అసలు యాక్టింగ్ ఏమి తెలీదు. కానీ ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఈ చక్ మేట్ సినిమా నాకు వెరి స్పెషల్.నాకు ఎంతో నేర్పించింది. నాకు మంచి వ్యక్తులను పరిచయం చేసింది నాకు ఎన్నో మెమోరీస్ ఇచ్చింది. అమ్మ రాజశేఖర్ రెండు సాంగ్స్ కొరియోగ్రఫీ చేసారు చాలా బాగా కొరియోగ్రఫీ చేసారు మీరందరూ ఎంజాయ్ చేస్తారు అని తెలిపింది.

ప్రముఖ నటులు డా.రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, రఘుబాబు సంపూర్ణేష్ బాబు, షకలక శంకర్, పూర్ణిమ,కృష్ణ భగవాన్,ఆర్కే మల్లిడి, సుడిగాలి సుధీర్,అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్,సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్: మహతి, ఎడిటర్: క్రాంతి, లిరిసిస్ట్: రెహమాన్, కో ప్రొడ్యూసర్: కే.కామేశ్వర్, నిర్మాత, దర్శకత్వం: ప్రసాద్ వెలంపల్లి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు