విడుదల తేదీ: నవంబర్ 24, 2020
123telugu.com రేటింగ్: 2.75 / 5
నటీనటులు: వినోత్ కిషన్, అర్జున్ దాస్, పూజా రామచంద్రన్, మిషా ఘోషల్
దర్శకుడు: వి.విగ్నరాజన్
నిర్మాతలు: ప్రియా అట్లీ, సుధన్ సుందరం, జయరామ్, కె పూర్ణ చంద్ర
ఎడిటింగ్ : సత్యరాజ్ నటరాజన్
సినిమాటోగ్రఫీ : A M ఎడ్విన్ సాకే
సంగీతం: ప్రదీప్ కుమార్
గత ఏడాది తమిళ్ బ్లాక్ బస్టర్ “ఖైదీ”లో విలన్ రోల్ లో కనిపించి మెప్పించిన నటుడు అర్జున్ దాస్ నటించిన లేటెస్ట్ చిత్రం “అంధకారం”. ఒక మిస్టీరియస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
ఈ చిత్రం మొత్తం మూడు కీ రోల్స్ చుట్టూతా తిరుగుతుంది. ఒక మానసిక వైద్యునిగా ఇంద్రన్(కుమార్ నటరాజన్), అలాగే ఒక క్రికెట్ కోచ్ గా వినోద్(అర్జున్ దాస్) అలాగే కంటి చూపు సరిగ్గా లేని సూర్యం(వినోద్ కిషన్) కనిపిస్తారు. అసలు ఈ ముగ్గురి మధ్య ఉండే కామన్ పాయింట్ ఏంటి? అలాగే ప్రతీ ఒక్కరి వెనుక ఉన్న కథ ఏంటి? వీరందరికీ ఏమన్నా కనెక్షన్ ఉందా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో ఉన్న మూడు కీలక పాత్రల్లో మొదటగా క్రికెట్ కోచ్ గా కనిపించిన వినోద్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మరికొన్ని మిస్టరీ అంశాలు కూడా ఈ రోల్ చుట్టూ మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే సినిమా మొత్తం ఒక డార్క్ షేడ్ ను తీసుకొని చూపడంతో అందులో లీనం అయ్యేలా చేస్తుంది.
ఇక అలాగే మరో కీలక రోల్ లో కనిపించిన వినోత్ కిషన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ను అందించారు. కంటి చూపు లోపం ఉండే వ్యక్తిగా చాలా బాగా సెటిల్డ్ గా చేశారు. అలాంటి వ్యక్తి పడే కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులను చాలా నాచురల్ గా చేసి చూపించారు.
అలాగే మరో కీ రోల్ లో కనిపించిన కుమార్ నటరాజన్ మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. అంతే కాకుండా సినిమాకు ఎంతో కీలకం అయినటువంటి ఈ రోల్ కు పూర్తిగా అతడు న్యాయం చేకూర్చాడు. ఇక అలాగే సినిమా పూర్తి కావడడానికి రివీల్ అయ్యే డీటెయిల్ మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. వాటిని బాగా హ్యాండిల్ చేసారు.
మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సినిమా నిడివి కోసమే మాట్లాడాలి ఎందుకంటే ఈ చిత్రం దాదాపు మూడు గంటల పాటు ఉంటుంది. ఇది చాలా మందికి కాస్త పరీక్ష పెట్టే అంశమే. అలాగే ఇలాంటి తరహా సినిమాలకు ఆద్యంతం ఆసక్తిగా ఉండకపోతే ఆడియెన్స్ కు సహనం తగ్గొచ్చు.
ఇది కాస్త మైనస్ అని చెప్పాలి. ఇక అలాగే ఈ చిత్రంలో మంచి ఇంట్రెస్టింగ్ పాత్ర అనుకున్న నటరాజన్ పాత్రలో కూడా కొన్ని డీటెయిల్స్ మిస్సవ్వడం మూలాన చూసే ప్రేక్షకులకు క్లారిటీ మిస్సయినట్టు క్లియర్ గా అర్ధం అయ్యిపోతుంది. అందుకే ఇలాంటి కీ రోల్ విషయంలో ఇంకా జాగ్రత్త వహించి ఉంటే బాగుంది.
అలాగే మరో కీ రోల్ అయినటువంటి అర్జున్ దాస్ కు కూడా ఇదే కనిపిస్తుంది. అతనికి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఎపిసోడ్ కు సరైన ప్రెజెంటేషన్ లేదు. అలాగే మొదటి గంట సేపు కూడా సరైన కనెక్షన్స్ మిస్సవ్వడం మూలాన వీక్షకులకు అంతగా అర్ధం కాకపోవచ్చు.
సాంకేతిక విభాగం :
సినిమా టైటిల్ వింటేనే అర్ధం అవుతుంది ఈ చిత్రం విజువల్ గా కీలకమైంది అని. మరి అలాంటప్పుడు ఈ తరహా సినిమాలను ఎలా చూపించాలో అదే విధంగా సినిమాటోగ్రాఫర్ ఏ ఎం ఎడ్విన్ సకే అందించారు. ఒక డార్క్ షేడ్ ను సినిమా అంతా విస్తరించి మంచి ఆసక్తికరంగా మలిచారు. అలాగే ప్రదీప్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది.
అలాగే ఈ చిత్ర ఎడిటర్ సత్యరాజ్ నటరాజన్ కొన్ని సన్నివేశాల్లో స్కోప్ ఉన్నప్పటికీ వాటిని తగ్గించకుండా వదిలేసారు. అలాంటి సన్నివేశాలు కనుక కట్ చేసి ఉంటే మరింత గ్రిప్పింగ్ గా ఈ చిత్రం అనిపించేది. ఇక దర్శకుడు వి విగ్నరాజన్ విషయానికి వస్తే తాను మంచి బ్యాక్ డ్రాప్ ను ఎంచుకొని దానికి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను జోడించి అందించే ప్రయత్నం చేశారు.
ఈ ప్రయత్నం నిజంగా హర్షణీయం. కానీ కథనం విషయంలో జాగ్రత్తలు వహించి ఉండాల్సింది. నిడివిని తక్కువగా చూసుకొని కొన్ని పాత్రల విషయంలో మరిన్ని డీటెయిల్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేది. వీటి విషయంలో కానీ జాగ్రత్త తీసుకొని ఉంటే మరింత మంచి అవుట్ ఫుట్ వచ్చి ఉండేది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ అంధకారం చిత్రంలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే నటీనటుల మంచి పెర్ఫామెన్స్ లు అలాగే ఒక్కో రోల్ వెనుక స్టోరీలు కథకు తగ్గ విజువల్ బ్యాక్ డ్రాప్ హైలైట్ అవుతాయి. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాల్లోనే డీటెయిల్స్ మిస్సవ్వడం అలాగే నిడివి కూడా కాస్త మిస్సవ్వడం వంటివి కాస్త డిజప్పాయింట్ చేస్తాయి. కేవలం వీటిని కనుక పక్కన పెడితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం నచ్చుతుంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team