నాగ అన్వేష్, హేబా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఏంజెల్. ఈ చిత్రం నవంబర్ 3 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిన్న చిత్రంగా రాబోతున్న ఏంజెల్ కు హిందీ శాటిలైట్ హక్కులు భారీ ధర పలికింది. ఈ చిత్ర హిందీ శాటిలైట్ హక్కులు రూ 1.40 కోట్ల మినిమం గ్యారెంటీ ధర పలకడం విశేషం. చిన్న చిత్రమైన ఏంజెల్ కు ఇంత భారీ ధర పలకడం విశేషమే.
కాగా 1.40 కోట్లకు పైనా ఫిఫ్టీ – ఫిఫ్టీ పెర్సెంట్ తీసుకుంటారు. కాగా ఈ చిత్రాన్ని దాదాపు 300 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. సింధురపువ్వు కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పళని దర్శకత్వం వహిస్తున్నాడు.