మహేష్ బాబు తండ్రిగా అనిల్ కపూర్ ?

Published on Jan 18, 2021 7:57 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్ ఫాదర్ క్యారెక్టర్ కీలకమైనది. అందుకే ఆ పాత్రలో అనిల్ కపూర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. కాగా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ అయిన అనిల్ కపూర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందని తెలుస్తోంది.

అంటే మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయట. అలాగే నేటి రాజకీయ నేపథ్యం కూడా ఎంచుకున్నారని.. సినిమాలో రాజకీయాలను ప్రస్తావించబోతున్నారని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి

సంబంధిత సమాచారం :

More