బాలయ్య నుంచి మరో సినిమా.. అప్పటి నుంచే.. !

Published on Nov 29, 2021 7:01 am IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో కామెడీ డోస్ బాగా ఉంటుందని, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా ఉన్నా.. బాలయ్య శైలిలో సీరియస్ యాక్షన్ డ్రామా కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.

ఇక బాలయ్య కొత్త తరహాలో చూపించబోతున్నారట. ఫిబ్రవరి నుంచి స్క్రిప్ట్‌ వర్క్‌ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడికి ఫుల్ డిమాండ్ ఉంది.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసి హిట్ కొట్టాడు. అలాగే ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో చేయబోతున్న సినిమా కూడా హిట్ అయితే, ఇక అనిల్ రేంజ్ మరింతగా పెరుగుతుంది.

సంబంధిత సమాచారం :