మెగాస్టార్ మూవీపై అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్

మెగాస్టార్ మూవీపై అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్

Published on Mar 26, 2025 4:00 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా మెగాస్టా్ర్ చిరంజీవి, హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనుండటంతో ఈ మూవీ ఎలాంటి సబ్జెక్ట్‌తో రానుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చాడు. మెగాస్టార్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యిందని.. ఈ సినిమాలో చిరంజీవికి ‘శంకర్ వరప్రసాద్’ పాత్ర అల్టిమేట్‌గా నచ్చిందని.. ఇక ఆలస్యం చేయకుండా ‘చిరు’ నవ్వుల పండుగకు ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

దీంతో ఈ సినిమాలో చిరు పాత్ర ‘శంకర్ వరప్రసాద్’గా ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. ఇక పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు