చిరు లోని ఫుల్ పోటెన్షియల్ తో అనీల్ ప్లానింగ్ అట

చిరు లోని ఫుల్ పోటెన్షియల్ తో అనీల్ ప్లానింగ్ అట

Published on Feb 2, 2025 7:02 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో భారీ చిత్రం “విశ్వంభర” తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా చిరు నుంచి స్ట్రెయిట్ సినిమాగా రాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నుంచి సాలిడ్ లైనప్ ఉండగా అందులో సక్సెస్ ఫుల్ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో కూడా ఉంది అని తెలిసిందే.మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఒక క్లారిటీ తను అందించారు. మెగాస్టార్ లోని కామెడీ టైమింగ్ కోసం అందరికీ తెలిసిందే.

మరి తనకి ఉన్న స్ట్రాంగ్ కామెడీ టైమింగ్ ని టార్గెట్ గా తీయాలనుకుంటున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో మరో సాలిడ్ ఎంటర్టైనర్ వీరి కలయికలో రాబోతుంది అని చెప్పవచ్చు. చాలా కాలం నుంచి చిరు కామెడీ పరంగా తన మార్క్ సీన్స్ మిస్ అవుతున్నారు. మరి అనీల్ తన పోటెన్షియల్ ని ఎంతవరకు వాడుతారో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు