ఇంటర్వ్యూ: అనిల్ రావిపూడి – పదేళ్లలలో ప్రతి సినిమా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్

ఇంటర్వ్యూ: అనిల్ రావిపూడి – పదేళ్లలలో ప్రతి సినిమా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్

Published on Jan 22, 2025 8:01 PM IST

‘ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్ గా ఈ పొంగల్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఓఅద్భుతమైన విజయం ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ నా కెరీర్ లో ఓ హిస్టరీ’ అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి జనవరి 23తో పదేళ్ళు. ఈ సందర్భంగా విలేకరుల సమవేశంలో ముచ్చటించారు అనిల్ రావిపూడి.

దర్శకుడిగా ఈ పదేళ్ళ జర్నీ ఎలా అనిపించింది? ఎలాంటి హైస్, లోస్ చూశారు?

లక్కీగా ఆడియన్స్ సపోర్ట్ తో అన్నీ హైసే చూశాను. ఈ పదేళ్ళలో చేసిన ప్రతి సినిమా ఒక ఎక్స్‌పీరియన్స్. నేను ఏ జోనర్ సినిమా చేసినా ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్ గా ఈ పొంగల్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అద్భుతమైన విజయం ఇచ్చారు. ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్ కే ఇస్తాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మామూలు సక్సెస్ కాదు. ఆరు రోజుల్లో వందకోట్ల షేర్, వన్ వీక్ లో 200 కోట్లు క్రాస్ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్ లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి ఈ బలం వుందని ఆడియన్స్ చాలా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇచ్చారని అనిపిస్తోంది.

పదేళ్ళ కెరీర్ లో ఏం సంపాదించగలిగారు?

నా సినిమాని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ ప్రేమ. ఈ పదేళ్ళుగా నాకు వచ్చిన ఆస్తి అదే. దీన్ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నా. సంక్రాంతికి వస్తున్నాం తో నా ఆస్తి విలువేంటో ఆడియన్స్ మళ్ళీ చూపించారు. ఆడియన్స్ ప్రేమ పరంగా నేను మల్టీ మిలీనియర్‌ని.

సంక్రాంతికి వస్తున్నాం కథ రాసుకున్నప్పుడే ఇంత పెద్ద విజయాన్ని ఊహించారా?

ఎఫ్ 2 లాంటి మంచి ఎంటర్ టైనర్ తీద్దామని అనుకున్నాను. ఎఫ్ 2 లా ఆడితే చాలు అనుకున్నా, ఇది మా అంచనాలుకు మించి ఆడుతోంది. ఎనిమిదో రోజు కూడా సినిమా ఫిగర్స్, రెవెన్యు షాకింగ్ గా వుంది. ఇది చాలా సర్ ప్రైజింగ్ గా వుంది. ఫైనల్ నెంబర్ కూడా అందరూ సర్ ప్రైజ్ అయ్యే నెంబర్ ఉండబోతోంది. ఇది వెంకటేష్ గారికి, మా టీం అందరికీ ఆడియన్స్ ఇచ్చిన గొప్ప తీర్పు.

సంక్రాంతి సీజన్ మీకు కలిసొచ్చిందని భావిస్తున్నారా?

సీజన్ 20% అడ్వాంటేజ్ ఉంటుంది. 80% కంటెంట్ లో విషయం ఉండాలి. సీజన్ సినిమాని కాపాడుతుందని నేను ఎప్పుడు బిలీవ్ చేయను. సినిమా బాగుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఆ అడ్వాంటేజ్ ప్రతి సినిమాకి ఉంటుంది. ఈ సినిమాలో కంటెంట్ పరంగా మేము కొత్తగా ఫీల్ అయింది ఒక భార్య, ఒక మాజీ ప్రేయసితో ఒక వ్యక్తి ప్రయాణం. ఈ మధ్యకాలంలో ఇలాంటి టెంప్లేట్ నేను ఎక్కడా చూడలేదు. ఇది చాలా ఫ్రెష్ గా ఫీల్ అయ్యారు. అది సినిమా అంతటా కమ్యూనికేట్ చేయగలిగాను. ఆడియన్స్ కంటెంట్ ని కొత్తగా ఫీల్ అవ్వడం వల్లే ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చారని భావిస్తున్నాను.

సంక్రాంతి వస్తున్నాం బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్ వుండటం ఎలా అనిపిస్తోంది?

సినిమాకి జెన్యూన్ గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారనేది బుక్ మై షో చూస్తే అర్ధమైపోతుంది. ఈ సినిమా ఓపెనింగ్స్ నుంచే రికార్డ్ స్థాయిలో టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. చాలా ఏరియాల్లో రికార్డ్స్ క్రియేట్ అయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమా నా కెరీర్ లో ఎయిత్ వండర్.

సక్సెస్ మీట్ లో దిల్ రాజు గారు శిరీష్ గారు ఈ సక్సెస్ తో అనిల్ మమల్ని నిలబెట్టారని చెప్పడం ఎలా అనిపించింది?

నిలబెట్టింది నేనుకాదు..ఆడియన్స్. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్ కే ఇస్తాను. దిల్ రాజు గారు ఎన్నో అద్భుతమైన సక్సెస్ లు ఇచ్చారు. ఈ విజయంతో ఆడియన్స్ వారిని నిలబెట్టారు. సినిమాకి బళ్ళుకట్టుకొని వచ్చి చూశారు. ఈ సినిమా విజయం ఓ వండర్. ఓ కేస్ స్టడీ. ఈ సినిమా ఎందుకు ఇంతపెద్ద హిట్ అయ్యిందో నేను కేస్ స్టడీగా పెట్టుకోవాలి. మేమంతా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం.

మీ సక్సెస్ సీక్రెట్?

థియేటర్స్ లో ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు. అసలు నా బలం ఏమిటి అనేది అనలైజ్ చేస్తాను. ప్రతి సినిమాకి ముందు సినిమా తాలూక క్యారెక్టర్స్, రిసంబులెన్స్ పడకుండా జాగ్రత్త పడతాను. ఆటోమేటిక్ గా సినిమా ఫ్రెష్ గా ఉంటుంది.

ఈ పదేళ్ళలో మీలో మార్పు ఏమిటి? ఏం నేర్చుకున్నారు?

ఎలాంటి మార్పు లేదండి. ఇంతకు ముందు ప్రతిదానికి రియాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. వర్క్ పైనే ఫోకస్ చేస్తాను. ప్రతి శుక్రవారం వచ్చే సినిమాలు చూస్తాను. నేర్చుకోవాల్సిన విషయాలు వుంటే నేర్చుకుంటాను. ఇది ఈ పదేళ్ళుగా చేస్తున్నాను.

బుల్లి రాజు పాత్రకు హైహై నాయిక సినిమా స్ఫూర్తి ఉందా?

ఉంది. జంధ్యాల గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. హైహై నాయక లో ఒక సౌండ్ ఎఫెక్ట్ తో అది వస్తుంది. ఇప్పుడు ఓటీటీ నేపధ్యంలో బుల్లిరాజు పాత్రని డిజైన్ చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

మిమ్మల్ని ఆడియన్స్ ఈవివి గారితో పోల్చడం ఎలా అనిపిస్తుంది.?

ఈవివి గారు ఓ లెజెండ్. ఆయన సినిమాలు చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయనతో పోల్చడం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ.

చిరంజీవి గారితో చేసే సినిమా ఎలా ఉంటుంది?

చిరంజీవి గారితో చేయబోయే సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. ఎలాంటి జోనర్ లో చేయాలనే టాక్స్, హోమ్ వర్క్ జరుగుతుంది. వందశాతం అందరూ ఊహించినదానికంటే ఎక్కువగా చిరంజీవి గారిని ప్రజెంట్ చేయాలనే విల్ పవర్ తో ఉన్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు