అనిల్ రావిపూడి కాస్ట్లీ విల్లా కొన్నారా ?

Published on Mar 9, 2021 1:11 am IST

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడ ఒకరు. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా మారి వరుసగా హిట్లు అందుకుంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఈ విజయంతో ఆయన పారితోషకం కూడ పెరిగింది. హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో నిర్మాతలు కూడ అడ్వాన్సులు ఇచ్చి మరీ డేట్స్ లాక్ చేసుకుంటున్నారు. రెమ్యునరేషన్, ఆదాయం పెరగడంతో రావిపూడి ఇంటిని కూడ మారుస్తున్నారట.

సిటీలో ఆయన ఒక ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ విల్లా ఖరీదు 12 కోట్ల వరకు ఉంటుందని టాక్. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ జరుగుతుండగా అది పూర్తవగానే అందులోకి మారిపోతారట. ఇకపోతే రావిపూడి ప్రస్తుతం వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్లో ‘ఎఫ్ 3’ సినిమాను చేస్తున్నారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడ మారారు ఆయన. శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో ‘గాలిసంపత్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :