‘యానిమల్’ బుకింగ్స్ ఓపెన్ – హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్

‘యానిమల్’ బుకింగ్స్ ఓపెన్ – హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్

Published on Nov 24, 2023 3:00 AM IST


బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ లవ్ ఎమోషనల్ మూవీ యానిమల్. ఈ పాన్ ఇండియన్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకుని అందరిలో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచిన యానిమల్ డిసెంబర్ 1న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ కి మంచి కలెక్షన్ లభిస్తోంది. ఇక ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ బుకింగ్స్ తాజాగా పలు ప్రాంతాల్లో ఓపెన్ కాగా ప్రస్తుతం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ తో అందరిలో యానిమల్ పై విపరీతంగా అంచనాలు ఏర్పడడంతో మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు