బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “యానిమల్” కోసం అందరికీ తెలిసిందే. మరి బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇపుడు మూడో సాంగ్ ని అయితే రిలీజ్ చేశారు.
మరి ఈ సాంగ్ డెఫినెట్ గా అందరికీ టచ్ అయ్యేలా కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి. మరి తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బంధాన్ని చెప్తూ సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన ట్యూన్ చాలా బాగుంది. ఇక తెలుగులో కూడా మంచి లిరిక్స్ తో సాంగ్ ఉండడంతో మన వాళ్ళకి కూడా ఈ సాంగ్ ఈజీగా కనెక్ట్ అవుతుంది అని చెప్పాలి. ఇక సాంగ్ లో రణబీర్ కపూర్ మరియు అర్జున్ కపూర్ ల మధ్య బాండింగ్ లో దర్శకుడు చాలా బాగా చూపించాడు. మరి వరల్డ్ వైడ్ గా ఈ డిసెంబర్ 1న రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి