“దేవర” లో “అనిమల్” స్టార్ ఎంతవరకు నిజం?

“దేవర” లో “అనిమల్” స్టార్ ఎంతవరకు నిజం?

Published on Jul 26, 2024 7:03 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమానే “దేవర”. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా చిత్రం ఇప్పుడు శరవేగంగా పూర్తి అవుతుంది. ఇక ఈ సినిమా లోకి తాజాగా మరో స్ట్రాంగ్ ఎడిషన్ యాడ్ అయినట్లు కొన్ని రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో అనిమల్ సెన్సేషన్ నటుడు బాబీ డియోల్ కూడా విలన్ గా నటిస్తాడు అంటూ రూమర్స్ మొదలయ్యాయి.

ఆల్రెడీ మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ఇతను కాకుండా బాబీ కూడా కనిపిస్తాడని ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఇది ఇప్పుడు కాదు గతకొన్ని వారాలు కితమే మొదలైన బజ్ ఇప్పుడు ఊపందుకుంది. దీని ప్రకారం తన రోల్ పూర్తి స్థాయిలో పార్ట్ 2 లో ఉంటుందట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు