లేటెస్ట్ వీడియో : ‘హాయ్ నాన్న’ తో ‘యానిమల్’ వైల్డర్ కన్వర్జేషన్ ప్రోమో రిలీజ్

లేటెస్ట్ వీడియో : ‘హాయ్ నాన్న’ తో ‘యానిమల్’ వైల్డర్ కన్వర్జేషన్ ప్రోమో రిలీజ్

Published on Nov 29, 2023 8:22 PM IST

ప్రస్తుతం హీరో నాచురల్ స్టార్ నాని యువ దర్శకడు శౌర్యువ్ తో చేస్తోన్న మూవీ హాయ్ నాన్న. ఈ మూవీలో జయరాం, బేబీ కియారా ఖన్నా, ప్రియదర్శి, శృతిహాసన్, అంగద్ బేడీ కీలక పాత్రలు చేస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ డిసెంబర్ 7న విడుదల కానుంది. ఇక మరోవైపు రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ యానిమల్.

ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా దీనిని డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా హాయ్ నాన్న హీరో నానితో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కలిసి సరదాగా చేసిన వైల్డర్ కన్వర్జేషన్ తాలూకు వీడియో ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. అటు నాని, ఇటు సందీప్ ఇద్దరూ తమ తమ సినిమాల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రస్తావిస్తూ సరదాగా సాగిన ఈ ప్రోమో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుండగా ఫుల్ వీడియోని అతి త్వరలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు