ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా అంతా కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన “దేవర” మ్యానియానే నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ దేవర మాస్ సీన్స్ అలాగే పాటలు స్కోర్ కి వస్తుంది. డే 1 నాటి నుంచే దేవర లో టైటిల్ కార్డ్స్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ పోర్షన్ ఇలా కీలక అంశాలు అన్నిటిలో కూడా సంగీత దర్శకుడు అనిరుద్ కి మంచి మార్కులే పడ్డాయి.
అయితే దీనిపై లేటెస్ట్ గా అనిరుద్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. దేవర విషయంలో అభిమానులు ఇస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. థియేటర్స్ లో ఒక కచేరి నడుస్తున్నట్టుగా మొత్తం మార్చేశారు దేవర పాటలకి, స్కోర్ కి ఇంత మంచి రెస్పాన్స్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు అని అలాగే ఇలాంటి ఒక మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని అందించినందుకు ఎన్టీఆర్ అన్నకు అలాగే దర్శకుడు కొరటాల శివకి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నాను అని దేవర విషయంలో అనిరుద్ ఎగ్జైట్ అవుతూ పోస్ట్ చేసాడు.
My heartfelt thanks and ever grateful to all the fans and audiences alike for your love towards #Devara, its songs and its score ???????????????????????? So fulfilling to see the theatres erupt and become concert halls all over ????????????
Was a mad experience and enjoyed every moment with dearest…— Anirudh Ravichander (@anirudhofficial) September 29, 2024