‘నాని-ఓదెల 2’ సినిమా కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..?

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు అభిమానులని స్టన్ చేసింది. ఇక ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నాని తన నెక్స్ట్ చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో తెరకెక్కిస్తున్నాడు.

కాగా, నాని కెరీర్‌లో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే, ‘హిట్-3’ ప్రాజెక్ట్ తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను కూడా అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version