“దేవర”.. ఇది ఆరంభం మాత్రమే.. అనిరుద్ సాలిడ్ అప్డేట్

“దేవర”.. ఇది ఆరంభం మాత్రమే.. అనిరుద్ సాలిడ్ అప్డేట్

Published on Aug 13, 2024 11:08 AM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి మాస్ లో సాలిడ్ హైప్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఒక సాంగ్ కంప్లీట్ మాస్ అయితే మరో సాంగ్ కంప్లీట్ క్లాస్ గా వచ్చి అదరగొట్టింది.

ఇక ఈ చిత్రం సంగీత ఆల్బమ్ పై మంచి బజ్ ఇపుడు నెలకొనగా ఆల్రెడీ సినిమా సాహిత్య రచయిత దేవర ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ వస్తుండగా తాజాగా సంగీత దర్శకుడు అనిరుద్ సాలిడ్ పోస్ట్ దేవర ఆల్బమ్ పై మరిన్ని అంచనాలు రేకెత్తించింది.

దేవర సాంగ్స్ కి ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్న ఆదరణ, ప్రేమ ఎంతో నచ్చింది అని అలాగే ఇది కేవలం ఆరంభం మాత్రమే.. మరింత ముందుంది అంటూ తాను పోస్ట్ చేసాడు. దీనితో దేవర ఆల్బమ్ కానీ దేవర మ్యూజిక్ కానీ నెట్ లెవెల్లో ట్రీట్ ఇవ్వనున్నాయి అని థన్ చెప్పకనే చెప్పేసాడు అని చెప్పాలి. మరి చూడాలి దేవర సంగీతం శ్రోతలకు ఎలాంటి ట్రీట్ ఇస్తుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు