నాని-ఓదెల సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్..?

నాని-ఓదెల సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్..?

Published on Oct 16, 2024 6:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘హిట్-3’ సినిమా షూటింగ్ ప్రారంభించిన నాని, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని కూడా రీసెంట్‌గా అనౌన్స్ చేశాడు. నానికి ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని తన కెరీర్‌లోని 33వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఇక ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ అందించేందుకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ని తీసుకునేందుకు చిత్ర యూట్ సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలోనే ఓ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

దీంతో ఈ సనిమాపై అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు అనిరుధ్ ఎలాంటి సంగీతం ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు