నేరుగా ఓటిటిలోకి అంజ‌లి ‘బ‌హిష్క‌ర‌ణ‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నేరుగా ఓటిటిలోకి అంజ‌లి ‘బ‌హిష్క‌ర‌ణ‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Jul 4, 2024 9:00 PM IST

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు, వెబ్ సిరీస్ ల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ జాబితాలో మ‌రో లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. న‌టి అంజ‌లి లీడ్ రోల్ లో న‌టిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘బ‌హిష్క‌ర‌ణ’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

ముఖేష్ ప్రజాప‌తి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో అంజ‌లి పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ను ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ5 లో జూలై 19 నుండి స్ట్రీమింగ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ విలేజ్ రివెంజ్ డ్రామా గా రాబోతుంది.

ఇందులో అంజ‌లితో పాటు రవీంద్ర విజ‌య్, శ్రీ‌తేజ్, అన‌న్య నాగ‌ళ్ల‌, ష‌ణ్ముక్, చైత‌న్య‌, సాగిరాజు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు