ఆ సీన్స్ ను అలా షూట్ చేశారు – అంజలి

ఆ సీన్స్ ను అలా షూట్ చేశారు – అంజలి

Published on Jul 23, 2024 4:47 PM IST

హీరోయిన్ అంజలి ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె ‘బహిష్కరణ’ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. పైగా ఈ సిరీస్ లో అంజలి బోల్డ్ సీన్స్ లో కూడా నటించింది. ఈ క్రమంలో అంజలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇంతకీ, అంజలి ఏం మాట్లాడారు అంటే.. ‘నా కెరీర్‌ మొదలు నుంచే నాకు మంచి పాత్రలు దొరికాయి. ఇక నేను ప్రతీ సినిమాకు హోమ్‌ వర్క్‌ చేస్తాను. అలాగే, ‘బహిష్కరణ’ సిరీస్ లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఈ సీన్స్ విషయంలో కూడా నేను తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. ముఖ్యంగా ఇంటిమేట్‌ సన్నివేశాలు చేసే సమయంలో అందరినీ బయటకు పంపి ఈ సీన్స్ ను షూట్ చేశారు’ అంటూ అంజలి చెప్పుకొచ్చింది.

అలాగే, అంజలి ఇంకా మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ గురించి నేను పట్టించుకోను. ఇప్పటికే, నా గురించి చాలా రూమర్స్ రాశారు. ఎవరైనా తప్పుగా రాసినప్పుడు చదివి బాధపడతాను. కానీ వెంటనే మర్చిపోతాను. ముఖ్యంగా నా పెళ్లిపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ పూర్తి అవాస్తవం’ అంటూ ఆమె చెప్పింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు