నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15 నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో మొదట హీరోయిన్ గా కేథరీన్ థెరీసా నటించబోతుందని వార్తలు వచ్చినా .. చివరికీ కేథరీన్ థెరీసా ఈ సినిమాలో నటించట్లేదని తేలిపోయింది. అయితే తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అంజలిని హీరోయిన్ ను తోసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంజలి బాలయ్య సరసన ‘డిక్టేటర్’ అనే సినిమాలో కలిసి నటించింది.
ఇక ఈ సినిమాలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే గుండుతో పాటు ఫుల్ మీసంతో ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.