“కల్కి” నుండి అన్నా బెన్ బీటీఎస్ స్టిల్ రిలీజ్!

“కల్కి” నుండి అన్నా బెన్ బీటీఎస్ స్టిల్ రిలీజ్!

Published on Jul 25, 2024 7:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఎడి చిత్రం జూన్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో కనిపించింది కొద్ది సేపైనా, అందరినీ ఎంతో ఆకట్టుకున్న నటి అన్నా బెన్. కైరా పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా అన్నా బెన్ కి సంబందించిన బీటీఎస్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ స్టిల్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన వైజయంతి మూవీస్ వారు నిర్మించడం జరిగింది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు