అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వసంతం.. ఇండియాస్ ఫస్ట్ డాల్బీ విజన్ గ్రేడింగ్ తో

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి దిగ్గజ నటుల్లో ధృవ తార అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. మరి నాగేశ్వరరావు టాలీవుడ్ లో కోసం ఎంతో ముందు చూపుతో సృష్టించిన అన్నపూర్ణ స్టూడియోస్ కోసం తెలియని వారు ఉండరు. మరి ఈ స్టూడియోస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 వసంతాలు ఇపుడు పూర్తి చేసుకుంది.

అయితే అన్నపూర్ణ స్టూడియోస్ తో కింగ్ అండ్ టీం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను తెలుగు సినిమాకి మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే లేటెస్ట్ గా ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల వేడుకల్లో ఇండియన్ సినిమా దగ్గర మొట్ట మొదటి ప్రయత్నం తీసుకొచ్చారు. సినిమాలో మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సౌండ్ అండ్ విజువల్స్ లో ‘డాల్బీ’ అనే పదాలు అంతా వింటూనే ఉంటారు.

ఇది వరకు డాల్బీ అట్మాస్ సౌండింగ్ తో ఎన్నో సినిమాలు థియేటర్స్ లో అలరించాయి. అలాగే ఇపుడు డాల్బీ విజన్ తో కూడిన సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ డాల్బీ విజన్ కోసం మొట్టమొదటి డాల్బీ విజన్ గ్రేడింగ్ మరియు మాస్టరింగ్ సదుపాయాలు కలిగి ఉండే స్టూడియోని తమ తరపు నుంచి స్థాపించారు. మరి దీనిని ఇండియాస్ ప్రైడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంచ్ చేయడం జరిగింది. దీనితో అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ ప్రత్యేక దినాన్ని ఒక కొత్త ఒరవడితో మొదలు పెట్టారని చెప్పాలి.

Exit mobile version