సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అన్నీ మంచి శకునములే’


యువ నటుడు సంతోష్ శోభన్ హీరోగా మాళవికా నాయర్ హీరోయిన్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ అన్నీ మంచి శకునములే. గౌతమి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, వాసుకి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఎంతో క్రేజ్ ఏర్పరిచాయి.

మే 18న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీకి సంబంధించి యూనిట్ ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. మ్యాటర్ ఏమిటంటే, నేడు అన్నీ మంచి శకునములే మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మూవీకి సెన్సార్ వారు క్లీన్ యు సర్టిఫికెట్ ని కేటాయించారు. కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కాగా తమ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీని మిత్రవిందా మూవీస్, స్వప్న మూవీస్ సంస్థల పై ప్రియాంక దత్, స్వప్న దత్ గ్రాండ్ గా నిర్మించారు.

Exit mobile version