టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్నీ మంచి శకునములే. ఈ చిత్రం మే 18, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రం కి సంబంధించిన శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
జీ తెలుగు మంచి ధరకు ఈ రైట్స్ ను దక్కించుకుంది. స్వప్న సినిమాస్ మరియు మిత్ర వింద మూవీస్ పతాకాల పై ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మాళవిక నాయర్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.