కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “జైలర్” ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇక ఇప్పటికీ కూడా సెన్సేషనల్ రన్ ని వరల్డ్ వైడ్ గా కంటిన్యూ చేస్తున్న ఈ చిత్రం మరి మన తెలుగు స్టేట్స్ లో కూడా భారీ రన్ ని సొంతం చేసుకుంది. ఇక వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు రిజిస్టర్ చేస్తూ ఉండడం విశేషం.
దీనితో జైలర్ హవా ఇప్పుడప్పుడే తెలుగు స్టేట్స్ లో ఆగేలా లేదు అని ట్రేడ్ వర్గాలు చెప్తుండగా జైలర్ తో అయితే రజినీ మళ్ళీ డబ్బింగ్ సినిమాల విషయంలో టాప్ పొజిషన్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. తమిళ్ నుంచి అయితే ఇది వరకే రజిని నటించిన రోబో, 2.0 సహా డిజాస్టర్ కబాలి కూడా టాప్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు జైలర్ అయితే టాప్ 3 లో ఒకటిగా నిలిచే దిశగా దూసుకెళ్తుంది. దీనితో రజినీ పేరిట తమిళ్ డబ్బింగ్ చిత్రాల విషయంలో మరో భారీ హిట్ నిలిచినట్టుగా చెప్పాలి.