“అల వైకుంఠపురములో” హిందీ రీమేక్ కు బడా హీరో?

Published on Jun 4, 2020 12:02 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం అందుకున్న విజయం మొత్తం అన్ని ఇండస్ట్రీలను మరోసారి టాలీవుడ్ వైపు చూసేలా చూసింది.

అందుకే ఈ చిత్రం తాలుకా రీమేక్ హక్కులను కూడా ఇతర భాషలలో ప్రముఖ నిర్మాతలు దక్కించుకున్నారు. అలా బాలీవుడ్ లో నిర్మాత అశ్విన్ వర్దె హిందీ రీమేక్ హక్కులు కొనుగోలు చెయ్యగా.. ఈ సినిమాలో హీరోగా నటించే వారి విషయంలో చాలా మంది టాప్ హీరోల పేర్లే వినిపించాయి.

మొదటగా షాహిద్ కపూర్ మరియు అక్షయ్ కుమార్ ల పేర్లు వినిపించగా తర్వాత యువ హీరో కార్తీక్ ఆర్యన్ పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అక్కడి మరో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేరు వినిపిస్తుంది. మరి ఇదైనా ఫైనల్ అవుతుందో లేదో చూడాలి. రణ్వీర్ ఇది వరకే టెంపర్ రీమేక్ చేసి సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More