మహేష్ నిర్మాణంలో మరో క్రేజీ కాంబినేషన్ ?

Published on Jul 7, 2020 2:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫెక్ట్ యాక్టర్ తో పాటు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ కూడా. ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ తో పాటు ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు. తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నాడట. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో మరో సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. పైగా ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి డైరెక్టర్ అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

ఇక వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గాని, ప్రభాస్ తో గాని ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే మహేశ్ తో వంశీకి సానిహిత్యం కారణంగా ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడేమో చూడాలి. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఇప్పటికే మహేష్ బాబు తన ఫేవరేట్ హీరో అని చెప్పిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే మహేష్, విజయ్ దేవరకొండతో సినిమా చేస్తే.. ఆ సినిమా పై మంచి అంచనాలు ఉంటాయి.

ఇక అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని సోనీ పిక్చర్స్ మరియు ఎప్లస్ఎస్ మూవీస్ వారితో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ముంబై టెర్రర్ అటాక్ లో వీరమరణం పొందిన ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

సంబంధిత సమాచారం :

More