మెగాస్టార్ సినిమాపై మరో క్రేజీ గాసిప్.!

Published on Oct 17, 2020 10:08 pm IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మొత్తం మూడు భారీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో మొదటిది బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న “ఆచార్య” సినిమా ఒకటి అయితే, మిగతా రెండు రీమేక్స్ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ లును కూడా మెగాస్టార్ తొందరగానే టేకప్ చేసి ముగించేయాలని అనుకుంటున్నారు.

అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రెండు రీమేక్స్ లో మెహర్ రమేష్ తో చేయనున్న వేదాళం రీమేక్ కూడా ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి పలు గాసిప్స్ కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరు రోల్ కు గాను ఒక సోదరి పాత్ర ఉంటుంది.

ఆ రోల్ కు సాయి పల్లవి ఓకే అయ్యిందని కొన్నాళ్ల కితం గాసిప్స్ వినిపించాయి. అలాగే ఇప్పుడు మరో క్రేజీ గాసిప్ వినిపిస్తుంది. అదే సోదరి రోల్ కు గాను ఇప్పుడు అభినయ నటి కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫిక్స్ అవుతారో లేక వేరే ఎవరన్నా చేస్తారో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More