చిరు సినిమా కోసం పరిశీలనలో మరొక దర్శకుడు

Published on Nov 21, 2020 1:14 am IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్న ఆయన తర్వాత ‘లూసిఫెర్, వేదాళం’ చిత్రాలను రీమేక్ చేయాలని అనుకున్నారు. వీటిలో ‘వేదాళం’ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడిగా ఖాయమైపోగా ‘లూసిఫర్’ విషయంలోనే కన్ఫ్యూజన్ నెలకొంది. మొదట ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు అనుకున్నా ఆ తర్వాత వివి.వినాయక్ వచ్చి చేరారు. స్క్రిప్ట్ పనులు కూడ మొదలయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కథలో మార్పులు చేస్తూ వచ్చారు వినాయక్.

అయితే సినిమాలోని కామెడీ ట్రాక్స్ చిరుకు నచ్చలేదని, అందుకే ఇద్దరి మధ్య పొంతన కుదరలేదని, వినాయక్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వినాయక్ స్థానంలో తమిళ దర్శకుడు మోహన్ రాజా పేరు వినిపిస్తోంది. రామ్‌ చరణ్‌ ‘ధృవ’గా రీమేక్‌ చేసిన తమిళ ‘తనిఒరువన్‌’ దర్శకుడే మోహన్‌ రాజా. అప్పట్లో మోహన్ రాజా దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తారనే టాక్ నడిచింది. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు చిరు సినిమా విషయంలో మోహన్ రాజా పేరు వినబడుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి అఫీషయల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.

సంబంధిత సమాచారం :

More