ప్రభాస్ సినిమాలో మరో హీరోయిన్ ?

ప్రభాస్ సినిమాలో మరో హీరోయిన్ ?

Published on Aug 16, 2020 1:46 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని తెలుస్తోంది. కాకపోతే ఈ హీరోయిన్ ను లోకల్ లోనే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. నివేదా థామస్ ను సెకండ్ హీరోయిన్ పాత్రలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా తీసుకురానున్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు