రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం!

రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం!

Published on Jul 19, 2024 3:00 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది.

ఆగస్ట్‌లో 15వ వార్షిక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లో పాల్గొననున్నారు రామ్ చరణ్. ఈ కార్యక్రమంకి A.R రెహమాన్, కరణ్ జోహన్, రాజ్ కుమార్ హిరానీ, ఇంతియాజ్ అలీ, కబీర్ ఖాన్ వంటి దర్శకులు, నిర్మాతలు కూడా హాజరు కానున్నారు. అయితే హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే ఉండటం విశేషం. ఈ హీరో తదుపరి బుచ్చిబాబు సానా, సుకుమార్ లతో సినిమాలు చేయనున్నారు. ఈ చిత్రాల పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు