నాని కెరీర్లో మరో ఐకానిక్ రోల్ వచ్చేసిందా.!

Published on Mar 30, 2023 10:00 pm IST


టాలీవుడ్ సినిమా దగ్గర తన సహజ నటనతో నాచురల్ స్టార్ గా పేరొందిన వన్ అండ్ ఓన్లీ హీరో నాని. తన సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఎలాంటి రోల్ ని అయినా చాలా ఈజ్ తో చేస్తాడు. అయితే కొన్ని రొటీన్ రోల్స్ పక్కన పెడితే తాను నటుడుగా పలు ఛాలెంజింగ్ రోల్స్ ని ఇష్టపడతానని ఎప్పుడో చెప్పాడు.

మరి ఈ లిస్ట్ లో అయితే రీసెంట్ గా వచ్చిన జెర్సీ నుంచి అర్జున్ అలాగే మొన్న శ్యామ్ సింగ రాయ్ లో శ్యామ్ పాత్రలు నాని కెరీర్ లో ఐకానిక్ రోల్స్ గా నిలిచాయి. అంతే కాకుండా అంటే సుందరానికీ లో కూడా నాని నటనకు స్పెషల్ అప్లాజ్ దక్కింది. మరి ఆ సినిమా నుంచి అసలు ఊహించని మేకోవర్ తో చేసిన లేటెస్ట్ ఇంటెన్స్ డ్రామానే “దసరా”.

ఇందులో ధరణి గా అయితే నాని జీవించేసాడని స్పెషల్ అప్లాజ్ ఇప్పుడు వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా నాని నటన కోసం చాలా మంది మాట్లాడుతున్నారు. దీనితో ఆ రేంజ్ లో పెర్ఫామెన్స్ ఇచ్చిన నాని కెరీర్ లో ఇప్పుడు ధరణి కూడా ఇక ఐకానిక్ రోల్ గా చోటు సంపాదించుకుంది అని చెప్పడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :