“పుష్ప” నుంచి మరో లీక్..?

“పుష్ప” నుంచి మరో లీక్..?

Published on Feb 24, 2021 8:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ యాక్షన్ పాన్ ఇండియన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాంబో నుంచి మొట్ట మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అయితే అల్లు అర్జున్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి దీనిపై మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మాత్రం లేదు. ఈ చిత్రం మొదలు అయ్యినప్పటి నుంచీ ఇప్పటి వరకు అనేక లీకులు బయటకు వచ్చేసాయి. మరి అలా ఇప్పుడు మరో లీక్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలోని ఓ సాంగ్ కు సంబంధించి విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ మరియు రష్మికాలు కలిసి ఉన్న ఈ ఫోటో సాంగ్ లోనిది అని అభిమానులే కొంతమంది జోరుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి ఇన్ని జరుగుతున్నా మేకర్స్ మాత్రం ఎందుకు కేర్ గా ఉండట్లేదో వాళ్ళకే తెలియాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు