‘అజ్ఞాతవాసి’ టైటిల్ తో మరో సినిమా.. కానీ

‘అజ్ఞాతవాసి’ టైటిల్ తో మరో సినిమా.. కానీ

Published on Apr 4, 2025 9:00 AM IST

మన టాలీవుడ్ ఆడియెన్స్ మర్చిపోలేని కొన్ని సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘అజ్ఞాతవాసి’ కూడా ఒకటి. గత 2018లో వచ్చిన ఈ సినిమా మిగిల్చిన జ్ఞ్యాపకాలు ఒక్క పవన్ అభిమానులకే కాదు టాలీవుడ్ ఆడియెన్స్ కి కూడా బాగా గుర్తుంటాయి. అయితే ఈ సినిమా ట్యాగ్ ఇపుడు మళ్ళీ వైరల్ గా మారింది.

ఆల్రెడీ ఒకసారి వచ్చిన అజ్ఞాతవాసి మళ్ళీ ఇపుడు ట్రెండ్ అవ్వడం చూసి ఒకింత పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆశ్చర్యంగా ఉన్నారు. అయితే ఇది పవన్ అజ్ఞ్యాతవాసి కాదు ఇదే టైటిల్ తో మరో సినిమా వస్తుంది. అది కూడా మన సౌత్ నుంచే కావడం విశేషం. కన్నడ సినిమా నుంచి అజ్ఞాతవాసి గా ఓ యూత్ ఫుల్ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ కి రాగా మళ్ళీ ఈ టైటిల్ వైరల్ గా మారింది. దీనితో ఆ అజ్ఞాతవాసి వేరు ఈ అజ్ఞ్యాతవాసి వేరు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు