చిరు “విశ్వంభర” లోకి మరో ప్రముఖ నటుడు

చిరు “విశ్వంభర” లోకి మరో ప్రముఖ నటుడు

Published on Jun 14, 2024 11:29 AM IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. అయితే ఈ సినిమాలో చిరు సహా అనేకమంది ప్రముఖ నటీనటులు నటిస్తుండగా లేటెస్ట్ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ని అయితే అందించారు.

దీనితో ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు కునాల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నట్టుగా మేకర్స్ అప్డేట్ అందించారు. మొత్తానికి అయితే తారాగణం పరంగా విశ్వంభర చాలా గ్రాండ్ గానే వెళుతుంది అని చెప్పాలి. మరి వశిష్ట ఈ నటీనటుల సమ్మేళనాన్ని ఎలా డీల్ చేస్తున్నాడో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు