“దేవర” నుండి మరో పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడం, జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రెండోసారి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 27, 2024 న భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

మేకర్స్ ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ మాస్ పోస్టర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించగా, స్టార్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్ విలన్ క్యారెక్టర్ చేశాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version