‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమా పై మరో రూమర్ ?

Published on Dec 6, 2022 3:01 am IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఐతే, గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోందని.. ఆ హీరోయిన్ పాత్రలోనే జాన్వీ కపూర్ ను ఫైనల్ చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే, ఈ రూమర్స్ లో వాస్తవం లేదని తెలుస్తోంది. కాకపోతే.. కథానుసారం వచ్చే ఓ స్పెషల్ సాంగ్ మాత్రం సినిమాలో ఉంటుందట. ఆ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఐతే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని ఈ సినిమాని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :